ఇంటర్వ్యూ: నభా నటేష్- అందుకే టాలీవుడ్ లో మిత్రులు ఎవరూ లేరు.

Published on Jan 19, 2020 1:36 pm IST

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న డిస్కో రాజా విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 

2019 మీకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది?

2019 నిజంగా నాకు బెస్ట్ ఇయర్. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ అందుకున్నాను. ఎక్కడకు వెళ్లినా, ఆ సినిమాలోని సాంగ్స్ పాడమని, డైలాగ్స్ చెప్పమని అడుగుతున్నారు. ఆ చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చింది.

 

డిస్కో రాజా ఎలాంటి చిత్రం?

డిస్కో రాజా మూవీ మాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పవచ్చు. వి ఐ ఆనంద్ గారి శైలిలో సాగే రవి తేజా సర్ మార్కు మాస్ మూవీ.

కథాకథనాలు చాలా భిన్నంగా ఉంటాయి.

 

డిస్కో రాజా మూవీలో మీ రోల్ ఏమిటీ?

గత చిత్రాలకు భిన్నంగా నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తూ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించే, ఒక అమ్మాయి పాత్ర నాది. నేను వెహికిల్ లోన్ అప్ప్రోవ్ చేసే ఓ బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపిస్తాను. ఈ రోల్ నా నిజ స్వభావానికి చాల దగ్గరగా ఉంటుంది.

 

రవితేజ గారితో కలిసి నటించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

రవి తేజా గారితో కలిసి పని చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఆయన నటించిన కిక్ నా ఫెవరేట్ మూవీ. ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతం..సెట్ లో ఎదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉంటారు. సినిమాలు, ఫుడ్, ఆయన ఫార్మ్ హౌస్ లో పండించే ఫ్రూట్స్ గురించి చెవుతూ ఉండేవారు.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిత్రులు ఎవరైనా వున్నారా ?

నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు మిత్రులు ఎవరు లేరు. నాది బెంగుళూరు కావడం వలన ఇక్కడ షూట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోతాను. దానితో ఎవరితో స్నేహం పెంచుకునేంత సమయం దొరకడం లేదు.

 

మీకు, పాయల్ కాంబినేషన్ లో సన్నివేశాలు ఉంటాయా?

లేదు… మా ఇద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలు ఉండవు. నాకు ఎక్కువ సన్నివేశాలు రవితేజ, సత్యం రాజేష్, నరేష్ గారితో ఉంటాయి.

 

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది?

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నా రోల్ డిఫరెంట్ గా అనథర్ లెవెల్ లో ఉంటుంది. అది కూడా ఓ భిన్నమైన పాత్ర.

 

టాలీవుడ్ లో ఇంకా ఏ హీరోతో చేస్తున్నారు ?

తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా చేస్తున్నాను. అలాగే తమిళంలో ఓ స్టోరీ డిస్కషన్స్ లో ఉంది.

సంబంధిత సమాచారం :

More