ఇంటర్వ్యూ: కృష్ణ విజయ్ ఎల్- హీరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి.

ఇంటర్వ్యూ: కృష్ణ విజయ్ ఎల్- హీరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి.

Published on Nov 5, 2019 2:10 PM IST

 

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు.ఇటీవల విడుదలైన బ్రోచేవారెవరురా మూవీతో ఒక మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆయన నటించిన తాజా చిత్రం తిప్పరా మీసం ఈనెల 8న విడుదల కానుంది. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

 

మీ గురించి చెప్పండి ?

నాపేరు కృష్ణ విజయ్ అండి. నేను ‘అసుర’ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ చిత్రాలను నిర్మించాను. అసుర చిత్రానికి కూడా నేనే నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.

 

తిప్పరా మీసం అనే టైటిల్ పెట్టడం వెనుక కారణం ఏంటి?

మనం ఏదైనా సాధించినప్పుడు పెద్దవారు తిప్పరా మీసం అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ పై ఇండియా మ్యాచ్ గెలిచినప్పుడు,బోర్డర్ లో సైన్యం శత్రువులపై గెలిచినప్పుడు మనం ప్రౌడ్ మూవ్మెంట్ గా ఫీల్ అవుతాం. అలాగే ఒక ఇంటిలో కుర్రాడు తమ కుటుంబ సభ్యలు తిప్పరా మీసం అనే పని ఏమిచేశాడు అనేది మూవీ కథ. అందుకే టైటిల్ అలా పెట్టడం జరిగింది.

 

మదర్ సెంటిమెంట్ మూవీ అంటున్నారు,టైటిల్ ఏమో అలా ఉంది ?

టైటిల్ అలా ఉన్నప్పటికీ కథ ప్రధానంగా మదర్ సెంటిమెంట్ తోనే నడుస్తుంది. తల్లి కోసం హీరో ఏమి చేశాడు అనేది వృత్తాంతం.

 

శ్రీవిష్ణు తో పరిచయంఎలా ఏర్పడింది?

హీరో శ్రీవిష్ణు అసుర చిత్రంలో ఒక పాట చేశారు. అప్పటినుండి ఆయనతో పరిచయం ఏర్పడింది. పరిచయంతో అప్పట్లో ఒకడుండేవాడు మూవీ నిర్మాణంలో భాగస్వామి కావడం జరిగింది.

 

ఈ మూవీ శ్రీవిష్ణు పాత్ర ఎలా ఉంటుంది?

హీరో ఈ మూవీలో ఒక పబ్ లో డీజే గా పనిచేస్తుంటాడు. దీనితో ఆతని లైఫ్ నార్మల్ లైఫ్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే పాత్రలో కొంచెం నెగటివ్ షేడ్స్ ఉంటాయి. చివరికి తన పాత్ర పాజిటివ్ గానే ముగుస్తుంది.

 

శ్రీవిష్ణు తోనే చేయడానికి కారణం?

అతనితో వర్క్ కంఫర్ట్ గా ఉంటుంది. అందుకే శ్రీవిష్ణుతో జర్నీ అలా సాగుతుంది.

 

ఈ కథకు స్ఫూర్తి ఏమైనా ఉందా?

మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనల నుండి ఒక ప్రేరణగా ఈ కథను అల్లుకోవడం జరిగింది. ఒక చిన్న పాయింట్ ని సీడ్ గా తీసుకొని డెవలప్ చేశాము.

 

డైరెక్షన్ కష్టమా, ప్రొడక్షన్ కష్టమా ?

ఖచ్చితంగా డైరెక్షనే కష్టం. ఒక దర్శకుడిగా 24 క్రాప్ట్స్ గురించి తెలిసివుండాలి. ప్రతి రోజు హార్డ్ వర్క్ చేయాలి. నిర్మాతకు ఎంత పెట్టాం, ఎంత వస్తుందనే లెక్కలు మినహాయించి పెద్దగా కష్టం ఉందని నా అభిప్రాయం.

 

మీరు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు?

నేను చేసిన అసుర మూవీ కొంచెం క్రైమ్ థ్రిల్లర్ ఐనప్పటికీ నాకు డ్రామా జోనర్ అంటే చాలా ఇష్టం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు