ఇంటర్వ్యూ: అభిరామ్ వర్మ – అలా అనుకుంటే ప్రభాస్, రానా నాకంటే హైట్..!

Published on Feb 23, 2020 3:29 pm IST

అభిరామ్, కృతి గార్గ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సస్పెన్సు అండ్ యాక్షన్ థ్రిల్లర్ రాహు. దర్శకుడు సుబ్బు వేదుల తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీనితో హీరో అభిరామ్ మీడియా తో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

 

నటుడిగా ఎప్పుడు కెరీర్ మొదలుపెట్టారు?

ఫస్ట్ డైరెక్టర్ తేజా గారు తెరకెక్కించిన ‘హోరాహోరి’ సినిమాలో చిన్న రోల్ చేశాను.ఆ తరువాత మను అనే మూవీలో నెగెటివ్ రోల్ చేయడం జరిగింది. మను ఫిల్మ్ చూసి నన్ను డైరెక్టర్ గారు ఆడిషన్స్ చేసి నన్ను ఎంపిక చేశారు.

 

రాహు సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నేను రాహు మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నాను. కిడ్నాప్ అయిన హీరోయిన్ ని వెతికే అధికారిగా కనిపిస్తాను. ఫస్ట్ హాఫ్ లో మొత్తం లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ లో సీరియస్ యాక్షన్ ఉంటుంది. నా పాత్రలో భిన్న షేడ్స్ ఉంటాయి

 

రాహు అని టైటిల్ పెట్టారు కారణం?
రాహు అనే టైటిల్ పెట్టినంత మాత్రాన ఇది క్షుద్ర పూజలు, మూఢ నమ్మకాలకు సంబంధించిన చిత్రం కాదండి. సూర్యుడిని రాహు కప్పివేసి కొంత సమయం ఎలా కనిపించకుండా చేశాడో, అలాగే ఓ వ్యక్తి కారణంగా హీరోయిన్ ఇబ్బందుల పడాల్సివస్తుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం.

 

మీరు అసలు పోస్టర్స్ లో కనిపించడం లేదు కారణం?
ఇది విమెన్ సెంట్రిక్ మూవీ అందుకే పోస్టర్స్ లో నేను కనిపించడం లేదు. అయినప్పటికీ నా పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది. రాహు సినిమాలో నా పాత్రకు మంచి పేరొస్తుంది.

 

దర్శకుడు సుబ్బు వేదుల గురించి చెప్పండి?
ఆయన కూడా నాలాగే అమెరికాలో కెరీర్ ప్రారంభించి సినిమాల వైపు వచ్చారు. ఆయన ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు. దగ్గరుండి అన్ని క్రాఫ్ట్స్ చెక్కి సినిమా బాగా తీశారు.

 

నటుడిగా మీకు స్ఫూర్తి ఎవరు?

హీరోగా కమల్ హాసన్ గారిని ఇష్టపడతాను. యంగ్ హీరోలలో శర్వా నంద్ అంటే కూడా చాల ఇష్టం. ఇక నాకు మహేష్ ఆల్ టైం ఫేవరేట్, ఆయన సినిమాలు చూసే హీరోగా మారాలని నిర్ణయించుకున్నాను.

 

పరిశ్రమలలో కొత్త నటులు పరిస్థితి ఏమిటీ?
చిత్ర పరిశ్రమ పరిధి పెరిగింది. అనేక విధాలుగా అవకాశాలు వస్తున్నాయి. రోజుకు అనేక మంది కొత్త నటులు పరిచయం అవుతున్నారు. ఫిలిం మేకింగ్ అనేది చాలా సులభం అయ్యింది. టాలెంట్ ఉంటే ఆకాశాలు నీ దగ్గరకే వస్తాయి.

 

హీరోగా హైట్ మీకు డిస్ అడ్వాంటేజ్ అనుకుంటున్నారా?

ప్రభాస్, రానా నాకంటే ఎక్కువ హైట్ ఉన్నారు, వారు స్టార్స్ గా ఎదిగారు. హీరోలకు హైట్ అడ్వాంటేజ్ అవుతుంది కానీ డిస్ అడ్వాంటేజ్ కాదు.

సంబంధిత సమాచారం :