ఇంటర్వ్యూ: విక్టరీ వెంకటేష్- ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలి..!

Published on Dec 12, 2019 5:04 pm IST

వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కించిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ వెంకీ మామ. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు. రేపు ఈ మూవీ విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు రీల్ లైఫ్ మామ అల్లుళ్ళుగా చేస్తున్నారు, ఈ ఫీలింగ్ ఎలా ఉంది?

చాలా సంతోషంగా ఉంది, నిజానికి ఇది నాన్నగారి కల. ఆయన ఎప్పుడూ రానా తో ఒక సినిమా చేయాలి, చైతూ తో ఒక సినిమా చేయాలని అని అనేవారు. కానీ అప్పుడు కుదరలేదు.

చైతూ తో మీకు చిన్నప్పటి నుండి ఉన్న బాండింగ్ గురించి చెప్పండి?

వాడు చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేవాడు. అందరం వాడిని ఎత్తుకోవడానికి పోటీపడేవాళ్ళం. నా కళ్ళ ముందు పెరిగిన వాడు ఇప్పుడు హీరోగా నాతో పాటు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

వెంకీ మామ ఎలాంటి సినిమా?
కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిగిన కమర్షియల్ మూవీ.. వెంకీ మామ. మామ అల్లుళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ హైలెట్ గా ఉంటుంది.

మీతోకలిసి నటించడానికి చైతూ ఇబ్బందిపడ్డాడా?

కొద్దిరోజులు వాడికి అడ్జస్ట్ కావడం టైం పట్టింది, వాడు సెట్స్ లో అదోలా ఉంటుంటే… నీ మైండ్ లో ఏమి ఆలోచిస్తున్నావ్రా..? అని అడిగాను. తర్వాత మెల్లగా వాడు సెట్ అయ్యాడు. నాకంటే ముందే సెట్స్ కి వచ్చి రెడీ గా ఉండేవాడు.

ఈ సినిమాకు మీరే డ్రైవింగ్ ఫోర్స్ అనుకుంటా?

అలా ఏమీ కాదు, ఈ మూవీలో రెండు పాత్రలకు సమాన స్క్రీన్ స్పేస్ ఉంటుంది. అలాగే స్క్రీన్ పై వెంకటేష్, నాగచైతూ కనిపించరు, మామ అల్లుళ్ళు తప్ప.

ఈ ఏడాది వరుణ్ తో ఎఫ్2 చేశారు, ఇప్పుడు చైతుతో వెంకీ మామ, యంగ్ హీరోలతో చేయడం ఎలా ఉంది?

వెరీ గుడ్, చాలా బాగుంది, వారి నుండి కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఈ ఇద్దరు యంగ్ హీరోలతో చేయడం నేను బాగా ఎంజాయ్ చేశాను.

యంగ్ హీరోలలో ఇంకా ఎవరితో చేయాలనుకుంటున్నారు ?
జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలి. నాని తో అనుకున్నాం కుదరలేదు. ఇండస్ట్రీలో ఉన్న అందరు యంగ్ హీరోలతో చేయాలి అనుకుంటున్నాను.

ప్రస్తుత సినీ పరిశ్రమలో వచ్చిన మార్పులు ఏమిటీ ?
సినిమా బిజినెస్ , కాన్సెప్ట్, నిర్మాణం ఇలా అన్నింటిలో మార్పులు వచ్చాయి. మార్పు అనేది సర్వసాధారణం మరియు మంచిది కూడా. మనం దాన్ని అంగీకరించాల్సిందే.

గౌతమ్ కెరీర్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు?
వాడు ఇంకా చాలా చిన్నవాడు, అలాగే వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి.

అసురన్ రీమేక్ గురించి ఏమైనా చెప్తారా?

అసురన్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి నిరవధికంగా జరుపుకోనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సమ్మర్ లో విడుదల చేస్తాం.

శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా తీసుకోవడానికి కారణం?

శ్రీకాంత్ అడ్డాల కసి మీద ఉన్నాడు. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకోసం ఇద్దరం కలిసి పనిచేసిన అనుభవం ఉంది. బాగా కష్టపడే తత్త్వం కలవాడు. అందుకే ఈ చిత్రానికి ఆయన్ని తీసుకోవడం జరిగింది.

మీ 75వ చిత్రం గ్రాండ్ గా ఉండనుందా ?

ఈ నంబర్లు వద్దమ్మా…, ఈ నంబర్ల సెంటి మెంట్ నాకు లేదు. అది అనౌన్స్ చేసినప్పుడు చూద్దాం.

 

సంబంధిత సమాచారం :

More