సుకుమార్ సినిమాలో మహేష్ లుక్ పై ఇంట్రస్టింగ్ న్యూస్ !

Published on Jan 24, 2019 10:35 pm IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మహేష్ గెటప్ కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మహేష్ ఈ సినిమాలో గడ్డంతో రఫ్ లుక్ తో కనిపిస్తాడట. ఇక సినిమా నేపధ్యం కూడా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ కోసం చిత్రబృందం ఓ స్టార్ హీరోయిన్ని ఫైనల్ చేసే పనిలో వుంది. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమా కోసం కూడా బాగానే సన్నద్ధం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :