సింగిల్ షెడ్యూల్ తో ‘లైగర్’ ముగిస్తాడట !

Published on Jul 11, 2021 8:46 pm IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న “లైగర్” సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తి అయింది. ఇక మిగిలింది ఓన్లీ క్లైమాక్స్ మాత్రమే. పదిహేను నిమిషాలు పాటు సాగే ఈ క్లైమాక్స్ లో నాలుగు వందలమంది జూనియర్ ఆర్టిస్ట్ లు అవసరం అవుతారట. ఆలాగే భారీ యాక్షన్ స్టంట్స్ కూడా ఈ క్లైమాక్స్ లో ఉంటాయట. అయినా, ఈ మిగిలిన బ్యాలెన్స్ షూట్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లోనే తీయడానికి పూరి ప్లాన్ చేస్తున్నాడు.

ఇక సినిమాలోనే కీలకమైన ఈ క్లైమాక్స్ పార్ట్ వెరీ ఎమోషనల్ గా.. పవర్ ఫుల్ యాక్షన్ తో సాగుతుందట. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.

ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :