శాంతిభద్రతల బాధ్యతలతో పాటు క్రీడా మైదానంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో జరుగుతున్న వన్డే లీగ్ ఛాంపియన్షిప్ (A3 డివిజన్) తాజా సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆయన అజేయ శతకంతో రాణించారు.
126 నాటౌట్.. పట్టుదలతో బ్యాటింగ్
హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన సీవీ ఆనంద్ 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు పిచ్ తేమగా ఉండటంతో ఆరంభంలో బంతి బాగా స్వింగ్ అయింది. బ్యాటింగ్‌కు పరిస్థితులు అనుకూలించకపోయినా క్రీజులో నిలదొక్కుకున్న ఆయన, చక్కటి డ్రైవ్‌లు, స్క్వేర్ కట్లతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పిచ్‌పై కుదురుకున్న తర్వాత తనదైన షాట్లతో వేగంగా పరుగులు సాధించి అజేయ సెంచరీ పూర్తి చేశారు.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించిన ఆయన, 5 ఓవర్ల పాటు మీడియం పేస్ బౌలింగ్ చేసి ఫిట్నెస్ను చాటుకున్నారు. ఈ మ్యాచ్ విశేషాలతో పాటు బ్యాటింగ్ హైలైట్స్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజన్లు ఆయన ఆల్‌రౌండ్ ప్రతిభను అభినందిస్తున్నారు.


