‘అశ్వథ్థామ’ పాటలన్నిటికీ ఒక్కరివే స్టెప్స్ !

‘అశ్వథ్థామ’ పాటలన్నిటికీ ఒక్కరివే స్టెప్స్ !

Published on Nov 15, 2019 12:00 AM IST

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ‘అశ్వథ్థామ’ అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఆల్ సాంగ్స్ కు రఘు మాస్టారే కంపోజ్ చేస్తుండటం విశేషం. కాగా ఈ రోజు రఘు మాస్టర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఐరా క్రియేష‌న్స్ సంస్థ సోషల్ మీడియాలో రఘు మాస్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది.

కాగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా మ‌నోజ్‌ రెడ్డి, ఎడిట‌ర్‌ గారీ బిహెచ్‌, డైరెక్ష‌న్ ర‌మ‌ణ్‌ తేజ‌, ప్రొడ్యూస‌ర్ ఉషా ముల్పూరి,

సంబంధిత సమాచారం

తాజా వార్తలు