ప్రభాస్ “ఆదిపురుష్” షూట్ కు బ్రేక్.?

Published on Apr 15, 2021 10:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి ముంబైలో ఈ చిత్రం షూట్ కు ప్రభాస్ నిర్విరామంగా పాల్గొని మళ్ళీ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అక్కడ మారుతున్న పరిస్థితుల రీత్యా చిత్ర యూనిట్ మిగతా షూట్ ను అందాకా ఆపినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న కరోనా తీవ్రత కారణంగా అన్ని చిత్రాల షూట్స్ అందాకా నిలపాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడంతో ఆదిపురుష్ ప్రభాస్ లేని షూట్ ఆగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాస్ వరకు ప్లానింగ్ ప్రకారం అనుకున్న షూట్ జరిగిపోవడం మంచిది అయ్యింది అని చెప్పాలి. మరి ఈ షూట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :