అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అఖిల్ అక్కినేని హిట్ కోసం అనేకమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన బాక్సాఫీస్ పోటెన్షియల్ కి తగ్గ సరైన హిట్ రావాలని అంతా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ చేస్తున్న అవైటెడ్ విలేజ్ డ్రామా లెనిన్ పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా మాత్రం వారి సహనాన్ని గట్టిగానే పరీక్షించింది అని చెప్పక తప్పదు.
ఎన్నో వాయిదాలు తర్వాత ఫైనల్ గా ఈ జూన్ 26న కన్ఫర్మ్ అనుకుంటే మళ్లీ ఈ డేట్ నుంచి వాయిదా పడింది అనే టాక్ షాకింగ్ గా మారింది. జూన్ నుంచి జులై మొదటి వారానికి సినిమా వాయిదా పడినట్లు ఇప్పుడు టాక్. దీనితో ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పేలా లేదని చెప్పక తప్పదు. సో దీనిపై అభిమానులు అంతా ఒక అధికారిక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.


