అనుష్కని బాధ పడేలా చేస్తున్న తన మూవీ రిలీజ్ డేట్స్.?

అనుష్కని బాధ పడేలా చేస్తున్న తన మూవీ రిలీజ్ డేట్స్.?

Published on Sep 28, 2015 4:56 PM IST

Anushka1
ప్రతి ఒక్క యాక్టర్ తను చేస్తున్న సినిమా కోసం ఎంతో సమయం వెచ్చించి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. అంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితాన్ని ఇవ్వవు. ఆ సమయంలో బాధపడి తప్పు తెలుసుకొని సరిచేసుకొని వెళ్ళిపోవడమే మార్గం. ఈ విషయాన్ని యాక్టర్స్ కొంతవరకూ తట్టుకోగలరు. కానీ తన భుజాల మీదే సినిమా వేసుకొని సంవత్సరాలు తరబడి టైం ని స్పేడ్ చేసి తీసిన సినిమా సరైన టైంకి రిలీజ్ కాకుండా వాయిదాలు పడుతుంటే మాత్రం తీవ్ర నిరాశకి గురవుతారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుష్క రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనటించింది . అవే రుద్రమదేవి, సైజ్ జీరో. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాలు రెండూ ఫైనల్ గా ఒకే రోజున అనగా అక్టోబర్ 9న రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో ఒకదానితో ఒకదానికి పొంతన లేదు. రెండూ డిఫరెంట్ సినిమాలు అలాగే రెండు వేరు వేరు పాత్రల్లో అనుష్క నటించింది. కావున ఈ రెండు సినిమాలు సెపరేట్ సెపరేట్ గా రిలీజ్ అయితే సినిమాకి, అనుష్కకి మంచి రిజల్ట్స్ వస్తాయి.

కానీ ప్రొడక్షన్ టీమ్స్ మాత్రం ఒకే రోజున రిలీజ్ చెయ్యాలని ఒకేరోజు ఇలా రెండు సినిమాలు రిలీజ్ అవుతుండడం అనుష్కని బాగా నిరాశపడేలా చేస్తున్నాయి. మరి అనుష్క చేసుకొని ఈ రెండిటిలో ఏ సినిమా అన్నా వాయిదా పడుతుందా లేక ఒకేరోజు రిలీజ్ అవుతాయా అన్నది చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు