అక్కడ “బీస్ట్”, “వలిమై” రేంజ్ ని అందుకుంటుందా.?

Published on Apr 1, 2022 7:06 am IST

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర దాదాపు మన దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలే కనిపిస్తున్నాయి. అంతే కాకుండా దాదాపు సినిమాలు కూడా మంచి హిట్ గా కూడా నిలిచాయి. లేటెస్ట్ గా అయితే భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” హిట్ కాగా మరికొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో థలపతి విజయ్ నటించిన “బీస్ట్” కూడా ఒకటి.

ఈ సినిమాని హిందీలో “రా” గా రిలీజ్ చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో టార్గెట్ గా ఉందని చెప్పాలి. విజయ్ తో పాటు తమిళ్ లో భారీ క్రేజ్ ఉన్న మరో స్టార్ హీరో అజిత్ కుమార్. తాను చేసిన లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా “వలిమై”. ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. అయితే ఈ ఏడాదిలో కోలీవుడ్ నుంచి అయితే ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇదే.

అలాగే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమా హిందీలో కూడా హిట్ అయ్యింది. అది కూడా ఏకంగా 80 లక్షలకి పైగా ఫుట్ ఫాల్స్ తో అట. ఇది అజిత్ సినిమాకి చిన్న విషయం ఏమీ కాదు. మరి దీనిని “బీస్ట్” బీట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. లాస్ట్ టైం మాస్టర్ ని కూడా హిందీలో రిలీజ్ చేసారు కానీ అది సో సో గానే నిలిచింది. మరి వలిమై రేంజ్ ని బీస్ట్ ఇప్పుడు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :