ఇంకో రోజులో మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిపోనుంది. దీనితో హౌస్ లో మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు విన్నర్ అవుతారు అన్నది చర్చగా మారింది. అయితే ఇదే ఆఖరు వారం కావడంతో ఒక్కో కంటెస్టెంట్ కు కూడా చాలానే లెక్కలు మారిపోయాయి.
అయితే మరి బిగ్ బాస్ హౌస్ లో ఈ టైటిల్ విన్నింగ్ రేస్ లో ఎవరు ముందున్నారు ఎవరు ఎవరి తర్వాత స్థానాల్లో ఉన్నారు అన్న దానిపై బిగ్ బాస్ ముందే హింట్ ఇచ్చారా అని చెప్పొచ్చు. లాస్ట్ రెండు రోజుల్లో జరిగిన ఎపిసోడ్స్ ను గమనిస్తే బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి వారి కోసం మాట్లాడి వారిపై ఒక స్పెషల్ వీడియోను కూడా ప్రెజెంట్ చేసారు.
మరి ఈ లెక్కన చూస్తే మొదట స్థానంలో అఖిల్ ను, తర్వాత అభిజీత్, వీరి తర్వాత హారిక, ఆమె తర్వాత నాలుగో స్థానంలో సోహెల్ చివరగా అరియనాను పిలిచారు. ఇక అలాగే బిగ్ బాస్ హౌస్ లో మరియు బయట ప్రేక్షకుల పల్స్ ను బట్టి మారితే మొదటి రెండు స్థానాలు మారాలి తప్ప అంతా కరెక్ట్ గానే ఉందని చెప్పాలి. మరి గ్రాండ్ ఫినాలే రోజున ఇదే క్రమం ఉంటుందో లేదో చూడాలి.


