స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ పై ఓ స్టైలిష్ ఫైట్ ని షూట్ చేసారు. ప్రస్తుతం హైదరబాద్ లో షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర టీం ఓ షెడ్యూల్ కోసం ఊటీ వెళ్లనున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.
ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ‘త్రిశూలం’ అనే వర్కింగ్ టైటిల్ ని అనుకుంటున్నారని సమాచారం. కానీ ఇంకా ఈ టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యలేదని సమాచారం. దీనికన్నా బెటర్ గా వేరే టైటిల్ దొరికితే టైటిల్ మారే అవకాశం కూడా ఉంది. అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అలాగే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర – స్నేహ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని కె. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.


