రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఐతే, ఈ సినిమాలో పాన్ ఇండియా రేంజ్ ఆర్టిస్ట్ లు నటించినా.. తెలుగు నటుడు ‘చిత్రం శ్రీను’ కూడా ఓ పాత్రలో కనిపించాడు. నిజానికి ఇంత పెద్ద సినిమాలో ‘చిత్రం శ్రీను’కి ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం నిజంగా విశేషమే. కాగా చిత్రం శ్రీను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ గారిని సెట్స్‌లో చూస్తే… అసలు చిరంజీవి గారి అబ్బాయి ఇంత బాగా ఉంటాడా ?, ఇంత మంచోడా ? అనిపించింది. అంత అద్భుతమైన వ్యక్తిని నా లైఫ్ లో చూడలేదు’ అంటూ చిత్రం శ్రీను చెప్పుకొచ్చాడు.
అలాగే, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారితో 2-3 రోజుల్లోనే ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ చిత్రం శ్రీను మాట్లాడారు. కాగా ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ తదితరలు కీలక పాత్రలు పోషించారు.


