దేవిశ్రీ పై ఒత్తిడి పెంచేస్తున్న మహేష్ ఫ్యాన్స్

Published on Dec 19, 2019 8:10 am IST

రాక్ స్టార్ దేవిశ్రీ సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈ చిత్రం కొరకు ఇచ్చిన మూడు సాంగ్స్ బాగున్నప్పటికీ అవి మునుపటి దేవిశ్రీ స్థాయిలో లేవని కొందరి అభిప్రాయం. అలాగే మహేష్ రేంజ్ కి ఈ సాంగ్స్ సరిపోవడం లేదని అతని ఫ్యాన్స్ నిరాశ. మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు చిత్రానికి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. దీనితో కొరటాల శివ మహేష్ తో చేసిన రెండవ చిత్రం భరత్ అనే నేను మూవీకి కూడా దేవిశ్రీనే తీసుకున్నారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాకు కుడా దేవీశ్రీ సంగీతం ఇచ్చారు.

గత రెండు చిత్రాల పాటల విషయంలో మహేష్ ఫ్యాన్స్ సంతృప్తి చెందలేదు. సరిలేరు నీకెవ్వరు మూవీకి దేవిశ్రీ వద్దంటూ వారు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు. ఐతే మహేష్ అతనిపై నమ్మకం ఉంచి సరిలేరు నీకెవ్వరు మూవీకి సంగీతం అందించే బాధ్యతలు అప్పగించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మూడు పాటలు ఫ్యాన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచని నేపథ్యంలో ఆయన ఒత్తిడి గురవుతున్నాడా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మరో రెండు పాటలు రానున్నాయి. మరి మిగిలిన రెండు పాటలలో నైనా దేవిశ్రీ తన సత్తా చాటుతారేమో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :