శంకర్ చిత్రం, రోబోకు మించి…?

Published on Aug 7, 2019 10:28 pm IST

ప్రస్తుతం దర్శకుడు శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న “భారతీయుడు2” షూటింగ్ కొరకు సిద్ధమవుతున్నారు. త్వరలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ జరిగే అవకాశం కలదని సమాచారం. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సివుండగా, దర్శకుడికి,నిర్మాతలకు మధ్య బడ్జెట్ విషయంలో తలెత్తిన వివాదాల రీత్యా కొంచెం ఆలస్యమైంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్,ఐశ్వర్య రాజేష్ , ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండగా హీరో సిధార్థ ఓ కీలకపాత్ర చేయనున్నారు.

ఐతే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడు శంకర్ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ కొరకు ప్రయత్నాలు మొదలుపెట్టారని ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు శంకర్ నిర్మించిన చిత్రాలకు మించి అతిపెద్ద బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ కొరకు హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు కూడా మొదలుపెట్టారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో హీరోగా చేయమని హృతిక్ రోషన్ కి కూడా సంప్రదించాడట ఈ దర్శకుడు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :