శివ కార్తికేయన్ తో జాతి రత్నాలు మూవీ డైరెక్టర్!

Published on Jul 11, 2021 8:02 pm IST

తమిళ హీరో శివ కార్తికేయన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మెల్లగా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానం ను సంపాదించుకున్నారు. అయితే ఇటీవల జాతి రత్నాలు చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అను దీప్. అయితే శివ కార్తికేయన్ మరియు అనుదీప్ ఇద్దరూ కూడా కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆసియన్ సునీల్ వీరితో చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జాతి రత్నాలు లాంటి కామెడీ ఎంటర్టైనర్ తో అదరగొట్టిన అను దీప్ ఈసారి ఎలాంటి చిత్రం తెరకెక్కిస్తారో చూడాలి. అయితే ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :