వచ్చేది “రాకీ భాయ్” యేనా?

Published on Jul 25, 2019 9:52 pm IST

గత ఏడాది మన దక్షిణాది నుంచి వచ్చిన ఒక సినిమా మళ్ళీ అన్ని ఇండస్ట్రీలలోని హాట్ టాపిక్ గా నిలిచింది.అదే కన్నడ రాక్ స్టార్ యాష్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో వచ్చిన “కేజీఎఫ్ చాప్టర్ 1” అస్సలు ఎవ్వరు ఊహించని మాస్ ఎలివేషన్ సీన్లు రఫ్ అండ్ రగ్గుడ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా మొదటి నుంచి ఉండే సరికి ఈ చిత్రాన్ని చూసేందుకు మాస్ ఆడియెన్స్ క్యూలు కట్టారు.దీనితో విడుదలైన ప్రతీ చోట కూడా ఈ సినిమాకు కాసుల పంట పండింది.ఈ ప్రభావం ఈ చిత్రం తర్వాత రాబోయే “కేజీఎఫ్ చాప్టర్ 2” కోసం మళ్ళీ ఇటు తెలుగు మరియు కన్నడ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మాములుగా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న బజ్ వచ్చినా సరే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ నీల్ టీమే అధికారిక అప్డేట్ ను వదిలారు.దీనితో ఇప్పుడు సోషల్ మీడియా అంతా మరోసారి షేక్ అవుతుంది.రేపు 11 గంటలకు ఒక పెద్ద న్యూస్ ఉందని వారు ఒక పోస్టర్ తో విడుదల చేసేసరికి అంతా ఈ సినిమా హీరో యాష్ పోషించిన “రాకీ భాయ్” ఫస్ట్ లుక్కే అయ్యి ఉంటుందని లేదా అదే విడుదల చెయ్యాలని విపరీతమైన ఆత్రుతతో 11 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.మరి ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ఎలాంటి వార్తను అందజేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :