మహేష్ ప్లాన్ కూడా మారేలా ఉందా..?

Published on May 6, 2021 4:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్స్ స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రంలో కీలకమైన మొదటి షెడ్యూల్ ను కూడా మేకర్స్ కంప్లీట్ చేశారు. ఇక ఇది లైన్ లో ఉండగానే ఇటీవలే మహేష్ నుంచి త్రివిక్రమ్ తో తన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కూడా అనౌన్సమెంట్ జరిగిపోయింది.

అయితే ఈ సినిమా రేస్ లోకి వచ్చాక మహేష్ ప్లాన్ మారినట్టు తెలుస్తుంది. మొదటగా అయితే సర్కారు వారి పాట కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చెయ్యాలి అనుకున్నారు కానీ టైం గడుస్తున్న కొద్దీ గ్యాప్ ఎక్కువయ్యేలా ఉందని ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలను మహేష్ కంప్లీట్ చేసేయనున్నారని టాక్ వినిపిస్తుంది. కాస్త అటు ఇటు అయినా మహేష్ మాత్రం ఈ రెండు సినిమా షూట్స్ లో ఏకకాలంలోనే పాల్గొంటారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :