బిగ్ బాస్ 4 – మోనాల్ బ్యాలన్స్ చేసినట్టేనా.?

Published on Nov 25, 2020 11:00 am IST

ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అసలు ఇప్పటి వరకు ఎలా వచ్చిందా అని అని అనుకునే కంటెస్టెంట్స్ లో మోనాల్ గజ్జర్ ఒకరు. ఇప్పటికీ చాలా మంది ఫాలోవర్స్ అనుకునే మాట ఇది. అయితే ఎన్నో సార్లు నామినేట్ అవ్వడం సేవ్ అవ్వడం వీక్షకులకు ఒకింత ఆశ్చర్యం అనిపించింది.

కానీ లేటెస్ట్ గా మాత్రం ఆమె గేమ్ లో సడెన్ ఛేంజెస్ రావడంతో ఈ రెండు రోజులు మాత్రం మంచి హాట్ టాపిక్ అయ్యింది. అది కూడా ఎందుకో కూడా తెలుసు. మొన్న జరిగిన స్వాపింగ్ లో ససేమిరా అఖిల్ కు మోనాల్ సపోర్ట్ ఇవ్వను అని చెప్పేయడం అఖిల్ ఫాలోవర్స్ కు షాకిచ్చింది.

అలాగే ఇతర ఫాలోవర్స్ కూడా ఈ ఊహించని మూవ్ చూసి స్టన్ అయ్యారు. దీనితో మోనాల్ కు సుపోర్ట్ గా ఉండే ఆ కొద్ది మంది అఖిల్ అభిమానులు ఆమెపై కోపం తెచ్చుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం అవినాష్ అలాగే అఖిల్ ఇద్దరిలో ఎవరికి ఓట్ చెయ్యాలి..

అన్న పరిస్థితి వచ్చినపుడు మాత్రం మరో మాట లేకుండా అఖిల్ కే చేసింది. దీనితో మొన్న చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి బ్యాలెన్స్ అయ్యినట్టే అనిపించింది.అలాగే గత సీజన్ 2విన్నర్ రాహుల్ కూడా ఈమెకు సపోర్ట్ చెయ్యమంటున్నాడు. మరి ఈసారి నుంచి ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More