“రాధే శ్యామ్”లో ఇంకా బ్యాలెన్స్ ఉందా.?

Published on Jan 29, 2021 3:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ మరి ఈ లోపలే కొన్ని అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ మరియు పూజా హెగ్డేల టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే.

దీనితో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయినట్టుగా అనిపించింది కానీ లేటెస్ట్ గాసిప్ ప్రకారం ఈ సినిమాలో ఇంకా కాస్త పార్ట్ బ్యాలెన్స్ ఉన్నట్టే తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఆ కొన్ని సీన్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :