మరో క్రేజీ ప్రాజెక్ట్ కి అక్కినేని చైతన్య సై?

Published on Jul 4, 2021 11:04 pm IST

అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రం లో హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మరొక చిత్రం అయిన థాంక్ యూ చిత్రం లో రాశి ఖన్నా తో నటిస్తున్నారు. అయితే ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల అనంతరం చైతన్య మరొక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రామ్ పోతినేనీ కి వరుస విజయాలు ఇచ్చిన కిషోర్ తిరుమల తో చైతన్య సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం కి నిర్మాతగా వ్యవహరిస్తున్న డీవీవీ దానయ్య ఈ చిత్రం కి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. అయితే దీని పై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :