త్రివిక్రమ్ పేరు ఎందుకు పక్కన పెట్టారో ?

Published on Aug 7, 2019 6:48 pm IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రచయితగా ఉన్నపుడు రాసిన అద్భుతమైన చిత్రాల్లో ‘మన్మథుడు’ ఒకటి. అక్కినేని నాగార్జున కెరీర్ లోనే ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. మరి అలాంటి మూవీ టైటిల్ తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ‘మన్మథుడు 2 ‘ రాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా నాగార్జున ‘మన్మథుడు’ గురించి మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా మన్మథుడు క్రెడిట్ మొత్తం దర్శకుడు విజయ్ భాస్కర్ దే అన్నట్లు అర్ధం వచ్చేలా నాగ్ మాట్లాడాడు.

అయితే ఈ విషయం గురించి ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినా.. నాగార్జున మాత్రం త్రివిక్రమ్ పేరు చెప్పలేదు. తనకు మన్మథుడు కథ చెప్పింది విజయ్ భాస్కరేనని.. ఆయనే రోజూ తనని కలిసి ‘మన్మథుడు’ స్క్రిప్ట్ గురించి చెప్పేవారని.. అందుకే తనకు ‘మన్మథుడు’ సినిమా అనగానే విజయ్ భాస్కరే గుర్తుకువస్తారని చెప్పుకొచ్చాడు. మొత్తానికి నాగ్ త్రివిక్రమ్ గురించి కావాలనే మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే మన్మథుడు సినిమాలో త్రివిక్రమ్ కామెడీ ఓ రేంజ్ లో పేలింది. మరి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న మన్మథుడు 2లో కామెడీ ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :