The Paradise: ఈసారి నాని లెక్క తప్పిందా?

The Paradise: ఈసారి నాని లెక్క తప్పిందా?

Published on Jun 7, 2026 6:59 PM IST

నాచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారెంటీ హీరో అనే మార్క్ మన టాలీవుడ్ లో ఉంది. ఆన్ టైం సినిమాలు కంప్లీట్ చేస్తూ ప్రొడ్యూసర్ హీరోగా నాచురల్ స్టార్ తన సినిమాలు పక్కాగా ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోతాడు. అలానే గత సినిమా సరిపోదా శనివారం వరకు నాచురల్ స్టార్ వెనక్కి తిరిగి చూడకుండా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని టాలీవుడ్ లో స్థాపించుకున్నాడు.

అయితే దానిని మరోస్థాయికి భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం ఎందుకో ఇపుడు అంత అనుకున్న రేంజ్ లో వెళ్లట్లేదా అనిపిస్తుంది. ఈ సినిమా పరంగా మాత్రం నాచురల్ స్టార్ లెక్క తప్పిందా? అనే మాట వినిపిస్తుంది. ప్రతీ సినిమాకి పక్కాగా ఆన్ టైం విడుదల చేసిన నాని ఈ సినిమా మాత్రం అనుకున్న టైం ని దాటాల్సి వచ్చింది.

ఆల్రెడీ మార్చ్ లో రావాల్సిన ప్యారడైజ్ సినిమా ఆగష్టుకి వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఇదే ఆగష్టు 21 డేట్ లో మాస్ మహారాజ రవితేజ చిత్రం ‘ఇరుముడి’ లాక్ అవ్వడంతో ప్యారడైజ్ మళ్ళీ వాయిదా అనే మాట మొదలైంది. దీనితో ఈసారి పక్కాగా నాని లెక్క మాత్రం తప్పింది అనే అనుకోవాలి. సో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు