బజ్..నాని సినిమా మళ్లీ ఓటీటీ లోకా..? వేరే దారి లేదా?ఎంతవరకు నిజం?

Published on Aug 5, 2021 7:02 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “టక్ జగదీష్” కూడా ఒకటి. అయితే ఎప్పుడో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు కూడా థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతూ ముందుకు వచ్చింది. కానీ మధ్యలో కరోనా పరిస్థితులు మూలాన చాలానే ఓటీటీ డీల్స్ వచ్చినా నాని తన గత చిత్రం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏది ఏమైనా సరే టక్ జగదీష్ ని వెండితెరపై మాత్రమే ముందుగా నిలపాలని శతవిధాల ప్రయత్నించారు. కానీ రిలీజ్ డేట్ పై ఇప్పటికీ కూడా క్లారిటీ రాకపోవడం సినీ అభిమానుల్లో ఈ అంశం కాస్త సస్పెన్స్ గానే మారింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ మళ్లీ ఈ సినిమా ఓటీటీ లొనే తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల అయ్యేలా ఉందని అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ పెద్ద చిత్రం ఉందని టాక్ నడుస్తుంది. అలాగే అది ఇంకొంచెం ముందుకు వెళ్లి నాని సినిమానే అని తెలుస్తుంది. అయితే ఇన్నాళ్లు ఒక నిర్ణయం మీదనే బలంగా నిలబడి ఉన్నా మేకర్స్ మళ్లీ ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? నిజంగానే నాని సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుందా అన్న సందిగ్ధతకు కరోనా ఒక కారణం కాగా టికెట్ రేట్ల విషయం కూడా ఒకటి అని తెలుస్తోంది..

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని టికెట్ రేట్స్ పై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం చాలా గందరగోళ పరిస్థితులు కి దారి తీసింది. ప్రజలు థియేటర్స్ కి వచ్చి చూసే పరిస్థితి ఉన్నా కూడా ఈ ఒక్క విషయం పై ఇంకా సరైన క్లారిటీ రాకపోవడంతో వేరే దారి లేక టక్ జగదీష్ తో నాని మళ్లీ ఓటీటీ బాట పట్టి ఉండొచ్చు. అయితే ఒకవేళ నిజంగా డిజిటల్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి గల ప్రధాన కారణం ఇదే కావచ్చు. మరి ఈ టాక్ పై మేకర్స్ నెమ్మదిగా అయినా ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి.. ఒకవేళ నిజమే అయితే నాని అభిమానులకి అది హృదయ విధారక వార్తే అని చెప్పాలి..

సంబంధిత సమాచారం :