ఎన్టీఆర్ – అట్లీ కాంబో లో సినిమా వచ్చేనా?

Published on Jul 6, 2021 7:05 pm IST

దర్శకుడు అట్లి తెలుగు లో స్టార్ హీరో అయిన నందమూరి తారక రామారావు తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చిన వట్టి గాసిప్స్ అని అర్దం అవుతుంది. అయితే తాజాగా మరొకసారి వీరిద్దరి కాంబో పై చర్చలు జరుగుతున్నాయి. అయితే వీరిద్దరి కలయిక లో వచ్చే సినిమా లవ్ స్టొరీ అని, అందుకు సంబంధించిన పూర్తి కథ ను దర్శకుడు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే మరొక పక్క జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమా లు చేస్తూ బిజిగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాల అనంతరం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చేస్తున్నారు. అయితే అట్లీ తో చేయబోయే చిత్రం పై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :