ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగ్ దర్శకుడు సుజిత్ కలయికలో చేస్తున్న సాలిడ్ చిత్రం ‘ఓజి’ కూడా ఒకటి. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుంది అని ఆల్రెడీ ఓ టాక్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ తర్వాత ఈ టాక్ నెమ్మదిగా కనుమరుగు అయింది.
కానీ లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఓజి పార్ట్ 2 డెఫినెట్ గా ఉంటుందట. అయితే నాచురల్ స్టార్ నాని సుజిత్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


