పవన్ నుంచి సిసలైన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాబోతోందా.?

Published on Jul 2, 2021 3:01 pm IST

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. సినిమా టాక్ తో సంబందం లేకుండా భారీ రికార్డ్స్ పవన్ పేరిట ఉంటాయి. ఎలాంటి స్టార్ దర్శకునితో సినిమా చేయకున్నా కూడా సింపుల్ గా డే 1 రికార్డ్స్ సెట్ చెయ్యడం పవన్ స్పెషాలిటీ.. మరి అలాంటిది ఓ స్టార్ దర్శకుడితో కానీ సరైన కంటెంట్ తో సినిమా పడితే దాని రిజల్ట్ ఊహించని స్థాయిలో వస్తుంది. కానీ ఆ రేంజ్ హిట్ పవన్ కి తగిలి చాలా కాలమే అయ్యిపోయింది.

కానీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఒకదాన్ని మించి మరొక సాలిడ్ ప్రాజెక్ట్స్ ను పవన్ లైన్ లో పెట్టడం అందులోని పాన్ ఇండియన్ సినిమా కూడా ప్లాన్ చెయ్యడంతో మరోసారి పవన్ స్టామినా భారీ లెవెల్లో విట్నెస్ చెయ్యడం కన్ఫర్మ్ అయ్యింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ మరియు సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళితో సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో అభిమానుల్లో ఉంది. అలాగే అది నెరవేరే అవకాశం కూడా లేదని వారికీ తెలుసు.

కానీ ఏమో బహుశా జరగొచ్చేమో అన్న ఆశలు ఇప్పుడు చిగురిస్తున్నాయి. మన తెలుగులోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ స్టోరీ రైటర్ అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ పవన్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. మరి ఎలాగో విజయేంద్ర ప్రసాద్ రాసే కథలు అన్ని తన తనయుడు రాజమౌళినే తెరకెక్కిస్తారన్న తెలిసిందే. అలాగే అయన కూడా డైరెక్షన్ కి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ టాక్ ఒక లెక్కలో వైరల్ అవుతుంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నిజంగానే ఉందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :