స్పెషల్ ఫ్యాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న పవన్.?

స్పెషల్ ఫ్యాన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న పవన్.?

Published on Nov 29, 2020 8:08 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అలాగే వాటిలో ఇప్పుడు చేస్తున్న “వకీల్ సాబ్” కు గాను మళ్ళీ తాత్కాలిక విరామంను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే ఇపుడు పవన్ చేతిలో ఉన్న కొన్ని చిత్రాలు తాను ఎప్పుడో ఓకే చెప్పి మాట ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాటిలో వకీల్ సాబ్, అలాగే మైత్రి మూవీ మేకర్స్ తో అనుకున్న సినిమా కూడా ఒకటి.

మరి అలా పవన్ ఎప్పుడో అందులోను తనకున్న ఎందరో అభిమానుల్లో ఒక స్పెషల్ అభిమానికి ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకునే సమయం వచ్చినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ స్పెషల్ ఫ్యాన్ ఎవరో కాదు మన దక్షిణనాదిలోనే టాప్ మోస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన జానీ మాస్టర్. ఈ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ కు ఎప్పటి నుంచో పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే.

అప్పుడెప్పుడో “బాలు” టైం లోనో అంతకు ముందు నుంచే పవన్ తో ఒక సినిమా చెయ్యాలని జానీ మాస్టర్ అనుకున్నానని ఓసారి తెలిపారు. అందుకు పవన్ మాట ఇచ్చారు కానీ ముందు అతన్ని తన కెరీర్ పై దృష్టి పెట్టమన్నారని జానీ మాస్టర్ తెలిపారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా వీరి కాంబో సెట్టయ్యేలానే ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ లైన్ పవన్ విన్నారని పూర్తిగా స్క్రిప్ట్ ను పవన్ సిద్ధం చేసుకోమన్నారని పలు ఊహాగానాలు ఇప్పుడు మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు