పవన్ సినిమా రూమర్ కే పరిమితమా ?

Published on Nov 16, 2019 9:07 am IST

పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై ఆయన కేంద్రంతో చర్చించనున్నారని సమాచారం. పవన్ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపిస్తున్నారు. నిన్న డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు.

ఐతే ఇవ్వన్నీ పరిశీలిస్తుంటే మళ్ళీ పవన్ తెరంగేట్రం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన హిందీ చిత్రం పింక్ రీమేక్ లో నటించనున్నారు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో అవి వీగిపోయేలా కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడుగా అతి త్వరలో మూవీ మొదలుకానుంది అన్న తరుణంలో.. పవన్ ఢిల్లీ టూర్స్ ఆయన రాజకీయల్లో ఇక సీరియస్ గా కొనసాగుతారు అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More