భీమ్లా నాయక్ లో పవన్ సాంగ్..?

Published on Nov 24, 2021 12:30 am IST


పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి మరొక హీరోగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ మీడియా తో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే భీమ్లా నాయక్ చిత్రం ల్ పవన్ కళ్యాణ్ పై పాట గురించి అడగగా, దీని గురించి మీరు త్వరలో తెలుసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు థమన్. పవన్ కళ్యాణ్ ఇదివరకే కొన్ని చిత్రాల్లో పాటలు పాడారు. రీసెంట్ గా అత్తారింటికి దారేది చిత్రం లో కాటమ రాయుడా, అజ్ఞాతవాసి చిత్రం లో మరొక పాటతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

అయితే భీమ్లా నాయక్ లాంటి మాస్ చిత్రం లో పవన్ కళ్యాణ్ పాడితే సినిమా వేరే లెవెల్ కి పోతుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దీని పై త్వరలో క్లారిటీ రానుంది. నిత్యా మీనన్, సంయుక్త లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :