వెంకీ మామలో పాయల్ రోల్ అదేనా..?

Published on Dec 5, 2019 7:01 pm IST

వెంకీ మామ మూవీ విడుదలకు ఇంకా కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ జోరు పెంచారు. కాగా నేడు వెంకీ మామ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ పుట్టిన రోజు సంధర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. స్లేవ్ లెస్ జాకెట్, శారీ ధరించి చేతిలో బుక్స్ పెట్టుకొని వెళుతున్న ఆమె లుక్ రొమాంటిక్ గా ఉంది.

ఐతే పాయల్ లుక్ చేశాక ఆమె ఈ చిత్రంలో స్కూల్ టీచర్ లా కనిపిస్తుందని సమాచారం. మేనల్లుడు కోసం పెళ్లి, సంసారం వంటి సుఖాలు వదిలేసిన వెంకటేష్ ని లేటు వయసులో ప్రేమలో పడేసే అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తుంది. వెంకీ మామ చిత్రంలో చైతు కి హీరోయిన్ గా రాశి ఖన్నా చేస్తుండగా, థమన్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 13న వెంకీ మామ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More