ప్రభాస్ మరోసారి ఈ యంగ్ డైరెక్టర్ తో..ఎంతవరకు నిజం?

Published on Aug 31, 2021 9:00 am IST


పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో నటిస్తుండగా ప్రెజెంట్ డార్లింగ్ ఫ్యాన్స్ తన సినిమా “రాధే శ్యామ్” కొత్త పోస్టర్ తో ఫుల్ ఖుషీ గా ఉన్నారు. మరి ఇదిలా ఉండగా ప్రభాస్ లైనప్ పై మాత్రం ఎప్పటికప్పుడు సాలిడ్ బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. మరి ప్రెజెంట్ అధికారికంగా ఓకే అయ్యిన సినిమాలు కాకుండా ఆ తర్వాత చేసే సినిమాలపైనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.

మరి లైన్ లో ప్రభాస్ యంగ్ దర్శకుడు సుజీత్ పేరు మళ్ళీ ఇటీవల వినిపిస్తుంది. ఇది వరకే సాహో అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ ని సుజీత్ టేక్ చేసాడు. కానీ అంతగా ఆకట్టుకోలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో రిపీట్ కానుంది ఓ టాక్ వచ్చింది. అయితే ఇంకా ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. దీనిపై నిజముందో అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం అయితే ప్రభాస్ ఆదిపురుష్, సలార్ షూట్స్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :