ప్రభాస్ రాజమౌళి సెంటిమెంట్ కు గండికొట్టినట్లేనా…?

ప్రభాస్ రాజమౌళి సెంటిమెంట్ కు గండికొట్టినట్లేనా…?

Published on Sep 3, 2019 7:15 AM IST

సాహో మొదటి షో నుండే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ క్రిటిక్స్ సాహోకి అతి దారుణమైన రేటింగ్స్ ఇవ్వడంతో పాటు, దొరికిందే అనువుగా విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలుగులో సైతం సాహో చిత్రానికి ఏమంత సపోర్ట్ చేసే విధంగా రివ్యూస్ రాలేదు. దీనితో సాహో భారీ నష్టాలతో డిజాస్టర్ గా మిగలడం ఖాయం అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సాహో ఊహించని ఆదరణ దక్కించుకునుంటుంది.

తెలుగు రాష్ట్రాలలో కీలకమైన నైజాంలో సాహో దూసుకుపోతుంది. మొదటి రోజులు 9.4కోట్ల షేర్ సాధించిన సాహో బాహుబలి 2మొదటి రోజు నైజాం షేర్ ని అధిగమించడం గమనార్హం. ఇక మూడు రోజులకు గాను సాహో 20కోట్ల వరకు షేర్ సాధింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, కృష్ణ, గుంటూరు వంటి ప్రాంతాలలో సాహో వసూళ్లు బాగున్నాయి.

ఇక ఆశ్చర్యంగా తెలుగుకి మించిన ఆదరణ హిందీ వర్షన్ దక్కించుకోవడం విశేషం.అక్కడ సాహో మూడు రోజులకు గాను 79 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నార్త్ మరియు ఈస్ట్ ఇండియా ప్రాంతాలలో సాహో చిత్రం స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

దీనితో సాహో చిత్రం యూఎస్ మరియు తెలుగు తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల నష్టాలు మిగిల్చిన, చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ మరియు స్వల్ప లాభాలతో ముగిసే ఆస్కారం కలదు.హిందీలో మాత్రం సాహో లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది.దీనితో ప్రభాస్ రాజమౌళి సెంటిమెంట్ ని అధిగమించాడనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రాజమోళి సెంటిమెంట్ పేస్ చేసిన ఏ హీరో అయినా దారుణ ఫలితాలను చవిచూశారు. సాహో తో ప్రభాస్ మాత్రమే రికార్డు కలెక్షన్స్ సాధిస్తున్నాడు. కాబట్టి కొంత మేర ప్రభాస్ రాజమౌళి సెంటిమెంట్ కి గండికొట్టినట్లే అని చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు