చిరుని మెప్పించే పనిలో పూరి..?

Published on Apr 3, 2020 8:26 am IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. పూరి కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ జాయింట్ వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ లా కనిపించనున్నాడు. కాగా డైరెక్టర్ పూరి తాజా ఇంటర్వ్యూ లో ఓ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను అని చెప్పారు. దీనితో ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఆ స్టార్ హీరో చిరంజీవి అని తెలుస్తుంది. నిజానికి చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఆయన 150వ చిత్రానికి దర్శకత్వం పూరి వహించాల్సింది. ఆటో జానీ అనే టైటిల్ తో పూరి నెరేట్ చేసిన స్టోరీతో చిరంజీవి సంతృప్తి పడకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఐతే పూరి చిరుని ఎలాగైనా మెప్పించి సినిమా తీస్తాను అని చెప్పారు. అందుకే ఆయన కోసం మాంచి మాస్ ఎలిమెంట్స్ తో సూపర్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం పై స్పష్టత రావాలంటే ఇంకొద్దిరోజులు ఆగాలి.

సంబంధిత సమాచారం :

X
More