బాలీవుడ్ స్టార్ తో ప్లాన్ చేస్తున్న పూరి ?

బాలీవుడ్ స్టార్ తో ప్లాన్ చేస్తున్న పూరి ?

Published on Dec 12, 2022 9:00 AM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కి పూరి రీసెంట్ గా ఓ కథ చెప్పాడని, సల్మాన్ ఖాన్ కూడా పూరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ రూమర్ వైరల్ గా మారింది. మరి ఈ రూమర్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు.

నిజానికి పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రాస్తున్నాడని.. చిరుతో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించడానికి ఎదురుచూస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరి చిరు కోసం పూరి ఎలాంటి కథ రాశాడో చూడాలి. ఐతే, మరోవైపు ఉన్నట్టు ఉండి పూరి జగన్నాథ్ – సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు