“పుష్ప” కు ఇంకా అన్ని రోజులు బ్యాలన్స్ ఉందా.?

Published on May 11, 2021 8:04 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కోవిడ్ బారిన పడి ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తన హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” కూడా చాలా మేర కంప్లీట్ చేసేసాడు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ కూడా షూట్ చేసిన చిత్ర యూనిట్ బన్నీకి కోవిడ్ రావడంతో స్వల్ప విరామం తీసుకున్నారు.

అయితే మరి ఇంకా ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని రోజులు షూట్ బ్యాలన్స్ ఉందో అన్న దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం ఈ పార్ట్ ఇంకా నెల నుంచి నెలన్నర రోజులు షూట్ బ్యాలన్స్ ఉన్నట్టుగా టాక్. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రంను అక్టోబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :