“రాధే శ్యామ్” నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ అవుతుందా.?

Published on Mar 2, 2021 8:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే పాన్ ఇండియన్ లెవెల్లో ఉన్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని రోజుల కితమే ఫస్ట్ గ్లింప్స్ రాగా దానికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మ్యూజిక్ ఆల్బమ్ కోసమే అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా అయితే జస్టిన్ ప్రభాకరన్ సాంగ్స్ కోసం మన సౌత్ మ్యూజిక్ లోకం అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే లేటెస్ట్ బజ్ ఇంకా వినిపిస్తుంది. ఇప్పటికే ఆ ఫస్ట్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి టైం కూడా ఫిక్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మార్చ్ లోనే ఉండొచ్చేమో అని గాసిప్స్ కూడా మొదలయ్యాయి. ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీస్ కు మ్యూజిక్ ఆల్బమ్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో తెలిసిందే. మరి ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :