“రాధే శ్యామ్” హిందీ టార్గెట్ అంతా..?

Published on May 27, 2021 2:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా బిజినెస్ పై పలు ఆసక్తికర టాక్స్ వినిపిస్తున్నాయి.

అలా ఓవర్సీస్ బిజినెస్ పై కూడా వినిపించి డీల్ ఫిక్స్ అయ్యినట్టు తెలిసిందే. అలాగే ఓటిటి డీల్స్ కూడా ఇంకా నడుస్తున్నాయని తెలిసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ కు మన తెలుగుతో పాటు స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పడిన హిందీలో సంగతి తెలుస్తుంది.

అక్కడ ఈ చిత్రానికి ఒక్క థియేట్రికల్ హక్కులే 110 నుంచి 120 కోట్లు పలికినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ లాస్ట్ చిత్రం “సాహో” అక్కడ ప్లాప్ టాక్ తో కూడా భారీ వసూళ్లు రాబట్టేసింది. మరి రాధే శ్యామ్ కి కనుక అన్ని సెట్టయ్యి మంచి టాక్ తెచ్చుకుంటే ఈ టార్గెట్ ప్రభాస్ కి పెద్ద విషయం కాదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :