“రాధే శ్యామ్” మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టేనా.?

Published on May 9, 2021 6:12 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు బిగ్గెస్ట్ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “ఆదిపురుష్” చిత్రం తాలుకా మేజర్ ఆఫ్ షూట్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఎలా అయితే అనుకున్న ప్లాన్ మారిందో మరో సినిమాకు కూడా ఊహించని విధంగా ప్లాన్ మారాల్సి వచ్చింది. అదే చిత్రం “రాధే శ్యామ్”. నిజానికి ఈ సినిమా పరంగా మిగిలి ఉన్న కొన్ని రీషూట్ ఎపిసోడ్స్ ఈ నెలలోనే ప్లాన్ చేశారు.

కానీ కోవిడ్ వల్ల అది కాస్తా రద్దయ్యి ఆదిపురుష్ షూట్ రేస్ లోకి వచ్చింది. దీనితో మళ్ళీ రాధే శ్యామ్ షూట్ వెనక్కి వెళ్లిందా లేక రెండిట్లోని ప్రభాస్ నటిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఇదిలా ఉండగా ఆల్రెడీ ప్రభాస్ తన లుక్స్ పరంగా చాలా చేంజ్ అయ్యిపోయాడు. వీటితో పాటుగా సలార్ కూడా ఇక్కడే జరగనుంది అని తెలుస్తుంది. దీనితో రాధే శ్యామ్ షూట్ సంగతి ఏమిటి అన్న డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. మరి ఆ మిగిలి ఉన్న ఆ కాస్త షూట్ ఎప్పటికి ఫినిష్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :