రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మార్కెటింగ్ మొదలెట్టాడుగా..!

Published on Aug 5, 2019 6:47 pm IST

నిన్న “ఆర్ ఆర్ ఆర్” చిత్ర బృందం స్నేహితుల రోజు సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టి అందరిని ఆకర్షించడం జరిగింది. “మా కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు అనుకోకుండా కలిసి విడిపోలేనంత అనుభందం కలిగిన మిత్రులు అయ్యారు. అలాగే మీ జీవితంలో కూడా ఇలానే హఠాత్తుగా కలిసి ఆతరువాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన వారుంటారు. అలాంటి మీ బెస్ట్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోని ఆర్ ఆర్ ఆర్ యెహ్ దోస్తీ యాష్ ట్యాగ్ తో మాకు పంపి విషెస్ చెప్పండి” అని ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకి విశేష స్పందన రావడంతో దేశవ్యాప్తంగా లక్షల మంది తమ ప్రాణ స్నేహితులతో దిగిన ఫోటోలు పంపి తన స్నేహ భావాన్ని చాటుకున్నారు.

కాగా రాజమౌళి తనదైన శైలిలో ఇప్పటినుండే “ఆర్ ఆర్ ఆర్” చిత్రానికి ప్రచారం కల్పించే పనిలో పడ్డారనిపిస్తుంది.అపజయం ఎరుగని రాజమౌళి సినిమాలు తీయడంలో ఎంత దిట్టో,వాటిని మార్కెట్ చేయడంలో అంతకు మించి. బాహుబలి2 చిత్రానికి ” కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు” అనే ఒక్క క్వశ్చన్ తో కావలసినంత ప్రచారం రాబట్టాడు. మరి “ఆర్ ఆర్ ఆర్” కూడా భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఇప్పటినుండే మూవీకి హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారనిపిస్తుంది. వచ్చే ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :