“ఆచార్య”లో చరణ్ రోల్ కి ఎమోషనల్ ఎండింగా.?

Published on May 26, 2021 11:40 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఎట్టకేలకు పలు ఆసక్తికర విషయాలను కొరటాల ఇటీవల వెల్లడించారు. మరి వాటిలో కీలకంగా చరణ్ పై చెప్పిన విషయాలు మంచి హైలైట్ అయ్యాయి.

చరణ్ రోల్ తో సినిమా మరో ఎత్తుకి వెళ్తుంది అని ఒక ఎమోషన్ ను చరణ్ నుంచి చిరు తీసుకెళ్లారని చరణ్ రోల్ ఈ సినిమాలో ఎలాంటి ఇంపాక్ట్ కలిగించనుందో కొరటాల హింట్ ఇచ్చేసారు. ఇక ఇక్కడ నుంచి అసలు టాక్ స్టార్ట్ అయ్యింది. కొరటాల చెప్పిన దాని ప్రకారం చరణ్ పాత్ర ఎమోషనల్ గా ముగిసిపోతుంది అని..

బహుశా ఆ రోల్ చిత్రంలో చనిపోవచ్చు అని కూడా ఎవరికి నచ్చిన థియరీలు వారు చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా కాస్త రొటీన్ గా ఉన్నా చరణ్ రోల్ కి కొరటాల ఎలాంటి ఎండింగ్ ఇస్తారో అన్నది సినిమా విడుదల అయ్యే వరకు చెప్పలేం. సో అప్పటి వరకు ఆగాల్సిందే.. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :