బిగ్ బాస్ 5: హోస్ట్ గా రానా కన్ఫర్మ్?

Published on Jul 8, 2021 3:30 pm IST

బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ కి సౌత్ లో తెగ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు లో కూడా వరుస సీజన్ లు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్, నాని, నాగార్జున అక్కినేని లు ఈ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ 5 కి ఎవరు హోస్ట్ గా ఉంటారనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో కి రానా దగ్గుపాటి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే స్టార్ మా రానా తో జరిపిన చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. అయితే రానా హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలో స్టార్ మా యాజమాన్యం దీని పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు కార్యక్రమాలకు రానా దగ్గుపాటి గతంలో వ్యాఖ్యాత గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రియాలిటీ షో కి రానా హోస్ట్ గా ఉంటే మరింత ఆసక్తి గా ఉండే అవకాశం ఉందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి దీని పై మా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :