చెన్నైలో ఆగిన రామ్ చరణ్ ‘గోవిందుడు..’ విడుదల..?

Published on Sep 30, 2014 6:20 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రేక్షకులలో, టాలీవుడ్ వర్గాలలో భారి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఒక్క చెన్నై నగరంలో తప్ప. ఈ వార్త చెన్నైలో మెగా అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. శుక్రవారం నుండి ‘గోవిందుడి..’ ప్రదర్శన ఉంటుందని సమాచారం.

జయలలిత అరెస్ట్ కు నిరసనగా తమిళ చిత్ర పరిశ్రమ నిరసన తెలిపింది. ఈ రోజు నిర్మాతలు, నటులు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఇతర టెక్నీషియన్లు నిరాహారదీక్ష చేపట్టారు. అలాగే ధియేటర్ ఎగ్జిబిటర్ లు మరియు డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కారణాలు ఏవైనా రేపు(భుదవారం, అక్టోబర్ 1) ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తమిళనాడులో విడుదల కావడం లేదు.

రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాను బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించారు. యువన్ శంకర్ రాజ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :