సాహో విజయం సైరా కు స్ఫూర్తి కానుందా…!

Published on Aug 21, 2019 6:45 pm IST

సాహో విజయం టాలీవుడ్ కి చాలా అవసరం అని విశ్లేషకుల వాదన. దానికి కారణం బాహుబలి చిత్రాన్ని మినహాయిస్తే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు లేవు. స్టార్ హీరో చిత్రాన్ని కూడా మనం తెలుగులో 70-80 కోట్ల బడ్జెట్ తో ముగించేస్తాం. సుజీత్, ప్రభాస్ మొట్టమొదటిసారి ఈ సాహసానికి ఒడిగట్టారు. ఏకంగా 350కోట్ల బడ్జెట్ కేటాయించి హాలీవుడ్ స్థాయి చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ విజయం టాలీవుడ్ కి చాలా అవసరం. సాహో విజయం తరువాత రానున్న సైరా అలాగే ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రయోజనాలకు దోహదం చేస్తుంది.

సాహో ఒక వేళ పరాజయం చెందితే ఆ ఫలితం సైరా బిజినెస్ పై పడుతుంది. బాహుబలి విజయం కేవలం గాలివాటమే అవుతుంది. ఇప్పటివరకు మిన్నకుండా బాలీవుడ్ ప్రముఖులు తెలుగు సినిమాపై సెటైర్స్ వేశే అవకాశం లేకపోలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా వసూళ్లపై అనుమానపు నీడలు అల్లుకుంటాయి. కాబట్టి సాహో విజయం సైరా కి స్ఫూర్తి అనడంలో సందేహం లేదు.

మరి ఇన్ని ఆశలు, అంచనాల మధ్య ఇంకా తొమ్మిది రోజులలో విడుదల కానున్న సాహో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి .

సంబంధిత సమాచారం :