మహేష్ మూవీలో.. ‘ఖడ్గం’ హీరోయిన్ ?

Published on Jul 24, 2019 3:00 am IST

“ఖడ్గం” చిత్రంలో సినిమా హీరోయిన్ అవ్వాలనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేసిన సంగీతను తెలుగు ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోరు. తమిళ తెర పై ఎప్పుడో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన సంగీత, ఖడ్గం చిత్రానికి ముందు కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా, ఆమెకు గుర్తింపు రాలేదు. ఐతే “ఖడ్గం” చిత్రం తరువాత ఆమె వరుస అవకాశాలు అందుకుంది. ఎక్కువగా ఈమె చిన్న హీరోల సరసన చేశారు. విజయేంద్రవర్మ, సంక్రాంతి వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించారు. ఎక్కువగా తమిళ చిత్రాలు చేసిన సంగీత 2009లో క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు తగ్గించారు.

మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరూ” చిత్రంలో సంగీత ఓ కీలకపాత్రలో కనిపించనుండదని సమాచారం. ఓ పాత్రకు సంగీత ఐతే సరిపోతుందని భావించిన దర్శకుడు ఆమెను ఆ పాత్రను చేయడానికి ఒప్పించాడని సమాచారం. దీని పై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. కాగా ఈ సినిమాలో రష్మిక మందాన మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి, రాజేంద్రప్రసాద్ వంటి నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు,అనిల్ సుంకర,మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :