డైరెక్ట్ ఓటిటి గా శ్రీ విష్ణు “రాజ రాజ చోర”

Published on Jul 12, 2021 7:30 pm IST

హసిత్ గోలి దర్శకత్వం లో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం రాజ రాజ చోర. ఈ చిత్రం లో సునైన, మేఘా ఆకాష్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరక్ట్ ఓటిటి గా విడుదల చేస్తున్నట్లు సమాచారం. జీ 5 లో డైరెక్ట్ ఓటిటి గా స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు చిత్రాల విడుదలలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని చిత్రాలు ఓటిటి బాట పట్టాయి. అయితే శ్రీ విష్ణు రాజ రాజ చోర చిత్రం ఈ ఆగస్ట్ 15 నుండి జీ 5 లో స్ట్రీమ్ కానుంది. అయితే దీని పై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :