వాల్మీకి చిత్రంలో శ్రీదేవి హిట్ సాంగ్…?

Published on Sep 1, 2019 1:08 am IST

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోదావరి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన పాటలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఐతే ఈ చిత్రంలోని ఓ పాట గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే శోభన్ బాబు, శ్రీదేవి, జయ ప్రద ప్రధాన తారాగణంగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలోని హిట్ సాంగ్ ని ఈ చిత్రం కొరకు రీమిక్స్ చేస్తున్నారట.

దేవత చిత్రంలోని “ఎల్లువొచ్చి గోదారమ్మ… ఎల్లకిల్లా పడ్డాదమ్మో” పాటను వేటూరిరాయగా, చక్రవర్తి స్వరపరిచారు. ఇక తమిళం లో ‘జిగర్తాండ’ సినిమాకు తెలుగు రీమేక్ గా ‘వాల్మీకి’ రూపొందుతోంన్న సంగతి తెలుస్తోంది. సెప్టెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం :