మెగా ఆఫర్ ని సుకుమార్ తిరస్కరించాడా…?

Published on Nov 8, 2019 5:31 pm IST

సుకుమార్ ప్రస్తుతం బన్నీ 20వ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే వీరి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది. కాగా ఈ మూవీ అనంతరం చరణ్ సుకుమార్ తో ఓ మూవీ చేయాలని భావించారట. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేసే భాద్యత సుకుమార్ కి అప్పగించాలని అనుకున్నారట. ఐతే తాను రాసుకున్న కథలను మినహా రీమేక్ చిత్రాలు చేయని సుకుమార్ ఈ మెగా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట. దీనితో మరో దర్శకుడికి ఈ మూవీ అప్పగించాలని చూస్తున్నారట రామ్ చరణ్.

మళయాలంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ చిత్రానికి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈమూవీలో మోహన్ లాల్ అద్భుత నటనకు ప్రశంసలందాయి. ఇక రామ్ చరణ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. సమకాలీన పరిస్థితులకు సంబందించిన సోషల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More